నా డబ్బులు పోయాయి
ABN, Publish Date - Jun 22 , 2025 | 11:46 PM
తన ప్రమే యం లేకుండా ఓ బ్యాంక్ మేనేజర్ తన ఖాతాలోని డ బ్బులను వేరే అకౌంట్‌కు ట్రా న్స్‌ఫర్ చేశాడని ఊట్కూర్ చెందిన న్యాయవాది కే.మహేశ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఖాతాలోంచి రూ.75 వేలు ట్రాన్స్‌ఫర్ అయ్యాయి
బ్యాంక్ మేనేజర్‌ను అడిగితే పట్టించుకోలేదు
పోలీసులకు న్యాయవాది ఫిర్యాదు
ఊట్కూర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తన ప్రమే యం లేకుండా ఓ బ్యాంక్ మేనేజర్ తన ఖాతాలోని డ బ్బులను వేరే అకౌంట్‌కు ట్రా న్స్‌ఫర్ చేశాడని ఊట్కూర్ చెందిన న్యాయవాది కే.మహేశ్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం ప్రకారం.. ఊట్కూర్‌కు చెందిన న్యాయవాది మహేశ్‌కు స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌లో సేవింగ్ అకౌంట్ ఉంది. అందులో రూ.లక్షా 24,340 ఉన్నవి. శనివారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లి, తన వ్యవసాయ రుణం పూర్తిగా చెల్లించి, నో డ్యూ సర్టిఫికెట్ తీసుకున్నాడు. సాయంత్రం అతని అకౌంట్ నుంచి బడకలి పాండప్ప అకౌంట్‌లోకి రూ.75,350 ట్రాన్స్‌ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చింది. అతని ప్రమేయం లేకుండా డబ్బులు వేరో అకౌంట్‌లోకి మారడంతో వెళ్లి బ్యాంక్ మే నేజర్‌ను అడిగాడు. ఆయన పట్టించుకోకుండా వెకిలి నవ్వులు నవ్వుతూ వేరే పని చేసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు.
Updated Date - Jun 22 , 2025 | 11:46 PM