సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలి
ABN, Publish Date - Jun 21 , 2025 | 11:29 PM
జిల్లాలోని 14 కేజీబీవీలో ఖా ళీగా ఉన్న సీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీ పో స్టుల భర్తీకి 2022-23 సంవత్సరంలో పరీక్షలు నిర్వహించారు.
వనపర్తి విద్యావిభాగం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని 14 కేజీబీవీలో ఖా ళీగా ఉన్న సీజీసీఆర్‌టీ, సీఆర్‌టీ, పీఈటీ పో స్టుల భర్తీకి 2022-23 సంవత్సరంలో పరీక్షలు నిర్వహించారు. మెరిట్ ఆధారంగా 1:3 నిష్పత్తి లో హెచ్‌టీటీపీ: //డీఈవో వనపర్తి. డబ్ల్యూ ఈఈబీఎల్‌వై. సీవోఎం/ వెబ్‌సైట్‌లో పొందుప రిచిన అభ్యర్థులు 23-06-2025 సోమవారం ఉ దయం 10 గంటలకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ని మిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయా నికి హాజరు కావాలని జిల్లా విద్యాశాఖ అధికా రి ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
అమరచింత, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : వి ద్యారంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని యువజన విద్యార్థుల సం ఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివా రం అమరచింత మండల కేంద్రంలో డీవైఎఫ్ ఐ, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఎంఈవో భాస్కర్ సింగ్‌ను కలిసి విద్యారంగ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల వారు మాట్లా డుతూ... పాఠశాలలో అస్తవ్యస్తంగా ఉన్న త రగతి గదులలను, మూత్రశాలలను తక్షణమే బాగు చేసి విద్యార్థులకు సరిపడా నోటు పుస్త కాలు దుస్తులను అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నా యకులు రాఘవేంద్ర, కుతుబ్, వెంకటేష్ తది తరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 21 , 2025 | 11:29 PM