అన్ని వర్గాల కోసం ఎమ్మార్పీఎస్ పోరాటం
ABN, Publish Date - Jun 15 , 2025 | 11:32 PM
ఎమార్పీఎస్ సుదీర్ఘ పొరా టంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిం దని, ఎన్నో వర్గాలకు, పేదవారికి ఎన్నో పథ కాలు వచ్చేలా కృషి చేశామని వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగ అన్నారు.
- వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
అలంపూరుచౌరస్తా, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఎమార్పీఎస్ సుదీర్ఘ పొరా టంలో అన్ని వర్గాల కోసం పోరాటం చేసిం దని, ఎన్నో వర్గాలకు, పేదవారికి ఎన్నో పథ కాలు వచ్చేలా కృషి చేశామని వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం ఆయన ఎమ్మె ల్యే విజయుడు, తెలంగాణ డీఐజీ బి.సుమ తితో కలిసి ఉండవల్లి మండలం, కలుగొట్ల గ్రామంలో మహాత్మ జ్యోతిబా ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను ఆవిష్కరించా రు. అంతకుముందు ఆయన అలంపూరు చౌరస్తా నుంచి భారీ ర్యాలీతో కలుగొట్ల గ్రా మానికి చేరుకున్నారు. విగ్రహావిష్కరణ ఆ నంతరం ఆయన బహిరంగ సభలో మాట్లా డారు. 1845-50 మధ్యలోనే మహిళల కోసం పాఠశాల స్థాపించినన మహనీయుడు ఫూలే అని అ న్నారు. ఎన్నో ఏళ్లుగా ఎమ్మా ర్పీఎస్ వర్గీకరణ కోసం పొరా డిందని, ఈ పోరాటంలో పలు ప్రభుత్వాలు పలు దఫాలలో ప్రవేశపెట్టిన బిల్లులన్నీ ఏకగ్రీ వంగా ఆమోదించపడ్డాయని గుర్తు చేశారు. అంతకు ముం దు ఐజీ సుమతి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో కొంత వరకే చది వించి అనాదిగా వస్తున్న వ్యవసాయం, కు లవృత్తుల పనులకు పంపిస్తుంటారని, అ లా కాకుండా అందరూ పూర్తిగా చదవాలని కోరారు. నా సొంత గ్రామంలో మహనీయు ల విగ్రహాల ఏర్పాటు చేయడం సంతోషం గా ఉందన్నారు. కులం, మతం లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఫూలే ఆశయాలను నేరవేర్చాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 11:32 PM