ఘనంగా ఎంపీ డీకే అరుణ జన్మదినం
ABN, Publish Date - May 04 , 2025 | 11:12 PM
బీజేపీ మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ జన్మదిన వేడుకలు ఆదివారం రెడ్‌క్రాస్ సొసైటీ వారి సన్నిధిలో ఆవాస ఆశ్రమ పాఠశాల (ఏనుగొండ) లోని పిల్లల మధ్య ఘనంగా జరుపుకున్నారు.
- 65 కేజీల కేక్ కట్ చేసిన డీకే అరుణ
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 4 (ఆంధ్రజ్యోతి) : బీజేపీ మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ జన్మదిన వేడుకలు ఆదివారం రెడ్‌క్రాస్ సొసైటీ వారి సన్నిధిలో ఆవాస ఆశ్రమ పాఠశాల (ఏనుగొండ) లోని పిల్లల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి కేక్ కట్‌చేసి పిల్లలకు తినిపించారు. ఎవరు లేరని దిగులు పడొద్దని, మీకు నేనున్నానని భరోసా కల్పించారు. రెడ్‌క్రాస్ లయన్ నటరాజ్ పాల్గొన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, అభిమానుల ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన 65 కేజీల కేకును కట్ చేశారు. తలకు తలపాకను ధరించి చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని నాయకుల్లో నూతనోత్సాహం నింపారు. అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎంపీ మాట్లాడుతూ నా పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, పడాకుల బాలరాజు. జయశ్రీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్‌కుమార్‌రెడ్డి, దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి, నాయకలు క్రిష్ణవర్ధన్‌రెడ్డి, అంజయ్య, బురుజు సుధాకర్‌రెడ్డి, క్రిష్ణవర్ధన్‌రెడ్డి, రమేష్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సాహితీరెడ్డి, నాయకురాలు లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:12 PM