ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కనీస వేతనం అమలు చేయాలి

ABN, Publish Date - Mar 17 , 2025 | 10:57 PM

ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, ఆశా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బాలమణిలు డిమాండ్‌ చేశారు.

మక్తల్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రం అందిస్తున్న ఆశ వర్కర్లు, సీఐటీయూ నాయకులు

- సీఐటీయూ డిమాండ్‌

- తహసీల్దార్‌ కార్యాలయాల ముందు ఆశా వర్కర్ల ధర్నా

నారాయణపేటరూరల్‌/మక్తల్‌/ మరికల్‌/మాగనూరు/ఊట్కూరు/ నర్వ, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు నిర్ణయించి అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్‌రాం, ఆశా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బాలమణిలు డిమాండ్‌ చేశారు. సోమవారం పేట మండల తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారితోషికం పేరుతో ఆశాలను వెట్టిచాకిరీకి గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లోనే ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఎన్‌ఎం ట్రైనింగ్‌ పూర్తి చేసిన ఆశాలకు పోస్టులు ఇవ్వాలన్నారు. ప్రతీ ఆదివారంతో పాటు పండుగ సెలవులను అమలు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఉప తహసీల్దార్‌ రామకృష్ణకు అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం నాయకులు బోయిన్‌పల్లి నాగమణి, రాధిక, నర్మద, లక్ష్మీ, అనురాధ తదితరులున్నారు.

అదేవిధంగా, మక్తల్‌ తహసీల్దార్‌ కార్యాలయ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజు మాట్లాడారు. అనంతరం తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఆశా వర్కర్ల నాయకురాలు గోవిందమ్మ, అమీనాబేగం, యశోద, ఇందిర, అనిత, పార్వతమ్మ, వెంకటలక్ష్మీ, సుజాత, పద్మ, లక్ష్మీ, రషీదాబేగంలు పాల్గొన్నారు.

మరికల్‌లో ఆశా వర్కర్లు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌కు అందించారు. శశికళ, అనురాధ, కవిత, అంబిక, భారతి, సుజాత తదితరులున్నారు.

మాగనూరులో తెలంగాణ ఆశా వర్కర్‌ యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. సీఐ టీయూ జిల్లా నాయకుడు పి.ఆంజనేయులు, ఆశాలు బాలమ్మ, పార్వతమ్మ, సుభద్రమ్మ, గౌరమ్మ, అంజమ్మ, వెంకటమ్మ తదితరులున్నారు.

ఊట్కూర్‌లో ఆశా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి, తహసీల్‌లో వినతిపత్రం అందించారు. తహసీల్‌ ముందు జరిగిన నిరసన కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్‌ బి.నారాయణ మాట్లాడారు. నాయకులు నరహరి, ఆశా కార్యకర్తలు బాలమణి, శివమ్మ, పద్మమ్మ, సాబేరా, జైనబ్‌బీ తదితరులున్నారు.

నర్వలో తహసిల్‌ వద్ద నిర్వహించిన ధర్నాను ద్ధేశించి సీఐటీయూ మండల అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి మణెమ్మ మాట్లాడారు. అనంతరం త హసీల్దార్‌ మల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Mar 17 , 2025 | 10:57 PM