ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బంద్‌

ABN, Publish Date - Jun 19 , 2025 | 11:31 PM

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం బం ద్‌తో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.

పేట డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న మధ్యాహ్న భోజనం కార్మికులు

- పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలని కార్మికుల సమ్మె

- టిఫిన్లు తెచ్చుకున్న విద్యార్థులు

నారాయణపేట, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనం బం ద్‌తో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. కొంత మంది తమ ఇళ్ల నుంచి టిఫిన్లు తెచ్చుకున్నారు. మరికొందరు ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. గత ఎనిమిది నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు, 11 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉండటాన్ని నిరసిస్తూ ఒ క్కరోజు(గురువారం) వంటలు బంద్‌ చేసి కార్మికులు డీఈవో కార్యాల యం ఎదుట ధర్నా చేశారు. ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి సీఐటీయూ జి ల్లా కార్యదర్శి బాల్‌రామ్‌ మాట్లాడుతూ మధాహ్న భోజన కార్మికుల బి ల్లులు సకాలంలో రాకపోవడంతో అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజ న కార్మికుల మెనూ చార్జీలు పెంచాలన్నారు. కోడిగుడ్డు ధరలు మార్కె ట్‌లో అధికంగా ఉండటంతో కార్మికులపై పడుతుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులకు 18 వేలు ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. పెండింగ్‌ బిల్లులు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తే పూర్తిస్థాయిలో సమ్మెకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా నాయకులు వెంకటమ్మ, బాలమణి, ఇందిరా, మణిమాల, వెంకటేశ్‌, సరళ, సత్తెమ్మ, పద్మమ్మ, లలిత తదితరులున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 11:31 PM