ఉలిగేపల్లిని సందర్శించిన కేంద్ర బృందం సభ్యులు
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:06 PM
జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని ఉలిగేపల్లి గ్రామాన్ని సోమవారం ఎన్‌ఆర్‌ఈజీఎస్ టీం సభ్యులు సందర్శించారు.
మల్దకల్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్ మండలంలోని ఉలిగేపల్లి గ్రామాన్ని సోమవారం ఎన్‌ఆర్‌ఈజీఎస్ టీం సభ్యులు సందర్శించారు. ఈసందర్భం గా గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్ర బృందం ఆరాతీసింది. గ్రామంలో వెలుగు మహిళా సంఘాల సభ్యులు నిర్వహిస్తున్న వస్త్ర దుకాణం, బుట్టలు అల్లే దుకాణాలను పరి శీలించారు. నిర్వహణ, ఆదాయం వంటి విషయాలను దుకాణదారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్కీం ఆధ్వర్యంలో చేపట్టిన క్రీడామైదానాలు, స్కూల్ టాయిలెట్లు, రోడ్డు షెడ్డు పనులను పరిశీలించి, అవి ఎంతవరకు పూర్తి అయ్యాయనే వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, నరహరి, అధికారులు ఉన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 11:06 PM