ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దోమల నివారణకు చర్యలు చేపట్టాలి

ABN, Publish Date - May 16 , 2025 | 11:29 PM

ప్రతీ ఒక్కరు దోమల నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.

మాగనూరులో డెంగీ వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య సిబ్బంది

- డెంగీ నివారణ దినంలో వైద్యులు

నారాయణపేట టౌన్‌/ మాగనూరు/ఊట్కూర్‌/మక్తల్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రతీ ఒక్కరు దోమల నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. జాతీయ డెంగీ నివారణ దినం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పేట ఆర్డీవో కార్యాలయం ముందు కలెక్టర్‌ జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. నినాదాలతో కొనసాగిన ర్యాలీ సావర్కర్‌ చౌరస్తా వరకు చేరుకుంది. జిల్లా వైద్యాధికారి డా.జయచంద్రమోహన్‌ డెంగీ వ్యాధి నివారణ చర్యలు, తీసుకునే జాగ్రత్తలు, పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పించారు. డీడీఎంహెచ్‌వో డా.ఎన్‌.శైలజ డెంగీ వ్యాధి యొక్క లక్షణాలు, చికిత్స విధానాన్ని తెలిపారు. డీపీవో భిక్షపతి, డా.నర్సింహ్మరావు, డా.గగన్‌, ఎంపీహెచ్‌ఈవోలు గోవిందరాజు, విజయ్‌కుమార్‌, పీహెచ్‌ఎన్‌ జానకమ్మ, మాస్‌ మీడియా అధికారి శ్రీనివాస్‌ తదితరులున్నారు.

అదేవిధంగా, మాగనూరులో పీహెచ్‌సీ డాక్టర్‌ అప్రోజుపాష, డాక్టర్‌ నాగజ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం డెంగీ నివారణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. అనంతరం డెంగీ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. ఆసు పత్రి సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

ఊట్కూర్‌లో పీహెచ్‌సీ సిబ్బంది గ్రా మస్థులతో కలిసి డెంగీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్‌ ఆర్‌.సంతోషీ మాట్లాడారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమలు పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఎల్‌హెచ్‌పీ డాక్టర్‌ భవాని, నర్సింగమ్మ, ఆరోగ్య పర్యవేక్షకుడు నర్సింహులు, ఆరో గ్య కార్యకర్తలు గోవిందమ్మ, సుజాత, మహేశ్వరి, ఎల్‌టీ నరేష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మక్తల్‌లో కర్ని పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ తిరుపతి మాట్లాడారు. వైద్యులు డాక్టర్‌ హబీబ్‌, నవీన్‌, డాక్టర్‌ మల్లికార్జున్‌, డాక్టర్‌ సమీనా, వైద్య సిబ్బంది సులోచన, సాయిబాబా, ఏఎన్‌ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2025 | 11:43 PM