ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ - వ్యక్తి మృతి

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:25 PM

విధులు ముగించుకుని ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గా యపడి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు.

జడ్చర్ల, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): విధులు ముగించుకుని ద్విచక్రవాహనం పై ఇంటికి వెళ్తుండగా వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో తీవ్రంగా గా యపడి, చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మహ బూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో చోటుచేసు కుంది. జడ్చర్ల సీఐ కమలాకర్‌ తెలిపిన వివరాల మేరకు... నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామానికి చెందిన ఎండీ రవూఫ్‌(47), జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలోని హెచ్‌ఈఎస్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఉదండాపూర్‌ నుంచి జడ్చర్ల మీదుగా గొరిటకు వెళ్తుండగా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో వెనకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో రవూఫ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం జిల్లా జనరల్‌ ఆసుపత్రికి, మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. రవూఫ్‌ సోదరుడు రహీం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడ్తున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - Jun 22 , 2025 | 11:25 PM