స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం
ABN, Publish Date - May 17 , 2025 | 11:10 PM
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.
- దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి
దేవరకద్ర, మే 17 (ఆంధ్రజ్యోతి) : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలోని ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని శ్రీనివాసగార్డెన్ ఫంక్షన్ హాల్‌లో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే హాజరై, మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, స్థానిక ఎన్నికల్లో కూడా సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలుపించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని, ఈ అవకాశాన్ని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందిపుచ్చుకొని అభ్యర్థులను గెలుపించుకోవాలన్నారు. అంతకుముందు మండలంలోని గోపన్‌పల్లిలో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేసి, రైతులకు స్ర్పింకర్లు, జీనుగ విత్తనాలు పంపిణీ చేశారు. మీ గ్రామం నుంచి కోయిల్‌సాగర్ కాల్వ ద్వారా ముందుకు నీరు పోతున్నా మీ చెరువుల్లోకి రాలేదని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మీ చెరువులోకి నీరు వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. టీపీసీసీ ఆర్గనైజింగ్ సెకట్రరీ అరవింద్‌కుమార్‌రెడ్డి, పర్యవేక్షకుడు భాస్కర్‌యాదవ్, దేవస్థాన చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, నరసింహరెడ్డి, మార్కెట్ చైర్మన్ కథలప్ప, ప్రశాంత్, మండల అధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, చైర్మన్ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2025 | 11:10 PM