ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం
ABN, Publish Date - May 30 , 2025 | 11:23 PM
ప్రభుత్వ పా ఠశాలలో పిల్లల నమోదును పెంచి కాపాడుకుందామని జి ల్లా అకాడమిక్ ఆఫీసర్ దుం కుడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
- ఏఎంవో దుంకుడు శ్రీనివాస్
మహబూబ్‌నగర్ విద్యా విభాగం, మే 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పా ఠశాలలో పిల్లల నమోదును పెంచి కాపాడుకుందామని జి ల్లా అకాడమిక్ ఆఫీసర్ దుం కుడు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం టీ ఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట జాతను సీనియర్ నాయకుడు కిష్టయ్యతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. తల్లితండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్చా లన్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవికుమా ర్, వెంకటేష్, భాస్కర్, హేమంత్ కుమార్, అజయ్, జయంతి తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే గుణాత్మ కమైన విద్య లభిస్తుందని టీఎస్‌యూటీఎఫ్ జి ల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. శుక్ర వారం టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో మండలం లోని అన్నాసాగర్, భూత్పూర్‌లో జీపు యాత్ర నిర్వహించారు. ఆయా గ్రామల్లో ప్రభుత్వ బ డులయొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. కొప్పుల ఖాదరయ్య, అజయ్, జయంతి, శంకర్‌నాయక్, నరేష్, నాగమద్దిలేటి, చిన్నయ్య పాల్గొన్నారు.
అవగాహన ర్యాలీ
కోయిలకొండ: పిల్లలను ప్రభుత్వ పాఠ శాలలో చేర్పించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రవికుమార్ కోరారు. గురువారం మండల కేంద్రంలో టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యం లో నిర్వహించిన బడిబాట అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈవో వెంకట్‌జీ, కిష్టయ్య, భాస్కర్, రాములు, మొ గులయ్య, రవిబాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జడ్చర్ల: మన ఊరి పిల్లలను, మన ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిద్దామని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహులు పిలుపునిచ్చారు. పౌరస్పందన వేదిక, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదుకై నిర్వహిస్తున్న ప్రచారజాతాలో భాగంగా శుక్ర వారం మండలంలో బండమీదిపల్లి, పెద్దపల్లి, వల్లూరు, కిష్టారం, పోలేపల్లి, గొల్లపల్లి గ్రా మాలలో ప్రచారం నిర్వహించారు.
మూసాపేట: అడ్డాకుల మండలకేంద్రంతో పాటు రాచాల, కందూరు, పొన్నకల్‌లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వెం కటేష్, ఎం.భీమన్నయాదవ్, జయంతి, అజయ్ పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:24 PM