తిర్మల్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం
ABN, Publish Date - Jul 25 , 2025 | 11:44 PM
మాజీ ఎం పీపీ దివంగత ఉత్తనూర్ తిర్మల్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు.
- బాస్కెట్‌బాల్ పోటీల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు
- ఉత్తనూర్‌లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి పోటీలు
అయిజ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎం పీపీ దివంగత ఉత్తనూర్ తిర్మల్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. అయిజ మండలంలోని ఉత్త నూర్‌లో శుక్రవారం రాష్ట్రస్థాయి మహిళ, పురుషుల బాస్కెట్‌బాల్ పోటీలను గౌతమ్‌రెడ్డి, రా మచంద్రారెడ్డి ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే విజయుడు పాల్గొని మాట్లాడారు. తిర్మల్‌రెడ్డి ఎంపీపీ, జడ్పీటీసీగా ఉన్న సమయంలో ఏటా విద్యార్థులకు జిల్లాస్థాయిలో క్రీడలు నిర్వహించారని, బాస్కెట్‌బాల్ పోటీలను కొనసాగించటం ఆనందదాయకం అన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్రీడా జెండాను ఎగురవేసి క్రీడాజ్యోతి వెలిగించారు. క్రీడాకారులతో కలిసి పోటీలను ప్రారంభించా రు. బాలికల విభాగంలో 14జట్లు, బాలుర విభా గంలో 18 జట్లు పాల్గొననున్నాయి. కార్యక్రమంలో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, చైర్మన్ మక్సూద్‌బిన్ అహ్మద్‌జకీర్, ప్రధాన కార్యదర్శి పృథ్వీశ్వర్‌రెడ్డి, మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు రాముడు, మునిసిపల్ వైస్‌చైర్మన్ నర్సింహులు, తిమ్మారెడ్డి, శివశంకర్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి ఉన్నారు.
Updated Date - Jul 25 , 2025 | 11:44 PM