ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తేజేశ్వర్‌ హత్య కేసులో కీలక పరిణామం

ABN, Publish Date - Jul 10 , 2025 | 11:46 PM

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది.

నిందితులను వాహనంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలిస్తున్న పోలీసులు

- పోలీసు కస్టడీకి నలుగురు నిందితులు

- మిగిలిన వారికి రిమాండ్‌ పొడిగింపు

- మరింత లోతుగా విచారణకు చర్యలు

- జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

గద్వాల క్రైం, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో నలుగురు నిందితులను బుధవారం అర్ధరాత్రి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. వారిని నాలుగు రోజుల పాటు విచారించేందుకు అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. తేజేశ్వర్‌ హత్య కేసులో పూర్తి స్థాయి వివరాలు రాబట్టేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

గత నెల 17న సంఘటన

గద్వాల జిల్లా కేంద్రంలోని కిష్టారెడ్డి బంగ్లా ప్రాంతానికి చెందిన సర్వేయర్‌ తేజేశ్వర్‌ గత నెల 17న ఇంటి నుంచి వెళ్లి తిరిగిరాలేదు. దీంతో అతడి అన్న తేజవర్ధన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధాన నిందితుడు తిరుమల్‌రావుతో పాటు మరో 7 గురిని అరెస్ట్‌ చేసి గత నెల 26వ తేదీన రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ కేసులో పోలీసులకు పలు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు సర్వేయర్‌ తేజేశ్వర్‌ను ఎలా పరిచయం చేసుకున్నారు? ఎలా నమ్మించారు? అతడిని వారి వాహనంలోకి ఎలా ఎక్కించుకున్నారు? డబ్బులు ఏమైనా ఇస్తామని ఆశ చూపించారా? లేకపోతే వారు చెప్పిన మాటలను అతడు ఎలా నమ్మి వారి వెంట వెళ్లారు? తదితర సందేహాలకు సమాధానం లభించాల్సి ఉంది. అలాగే తేజేశ్వర్‌ను మొదట ఎక్కడికి తీసుకెళ్లారు? ఎక్కడెక్కడ తిప్పారు? బయటపడ్డ నిందితులతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయాలపై లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా తిరుమల్‌రావు ఐశ్వర్యను తీసుకెళ్లింటే సరిపోయేది కదా? తేజేశ్వర్‌ను ఎందుకు హత్య చేయించాల్సి వచ్చింది? ఇలా హత్య వెనుక ఉన్న వాస్తవాలను పూర్తి స్ధాయిలో వెల్లడి కావలసి ఉన్నది. అందుకోసం కేసులో ప్రధాన సూత్రదారులుగా ఉన్న ఏ1 తిరుమల్‌రావు, ఏ3. కుమ్మరి నగేశ్‌, ఏ4 చాకలి పరశురామ్‌, ఏ5 చాకలిరాజులను కస్టడీలోకి తీసుకున్నారు. మిగిలిన నిందితులు ఐశ్వర్య, మోహన్‌, తిరుపతయ్య, సుజాతలను గురువారం కోర్టులో హాజరు పరిచారు. వారికి మరో 14 రోజులు రిమాండ్‌ను పొడిగిస్తూ న్యాయస్ధానం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Updated Date - Jul 10 , 2025 | 11:46 PM