ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:20 PM

మలేరియా వ్యాధి నివారణ కోసం ప్రతీ ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయచంద్రమోహన్‌ అన్నారు.

మరికల్‌లోని ఇందిరాగాంధీ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేస్తున్న ఆరోగ్య సిబ్బంది

- డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయచంద్రమోహన్‌

- మలేరియా వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ

నారాయణపేట న్యూటౌన్‌/మక్తల్‌/మరికల్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): మలేరియా వ్యాధి నివారణ కోసం ప్రతీ ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయచంద్రమోహన్‌ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం నారాయణపేట పట్టణంలోని ఆర్డీ వో కార్యాలయ ప్రాంగణం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్‌వో జెండా ఊపి ప్రా రంభించారు. వీరసావర్కర్‌ చౌరస్తాకు చేరుకున్న ర్యాలీలో డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆడ ఎలాఫిలిస్‌ దోమ ద్వారా మలేరియా వ్యాప్తి చెందు తుందన్నారు. ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించి దో మల నివారణ కోసం తగు జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు. కా ర్యక్రమంలో డా.శైలజ, డీవైడీఎంహెచ్‌వో డాక్టర్‌ నర్సింహారావు, డా.వై.మల్లికార్జున్‌, నారాయణ పేట ఐఎంఏ అధ్యక్షుడు భిక్షపతి, డీపీవో గోవిందరాజు, ఎంపీహెచ్‌ఈవో శ్రీనివాస్‌, సూపర్‌వైజర్లు సబితరాణి, శంకర్‌, శ్రీధర్‌, హెల్త్‌ అసెస్టింట్లు గోవిందరావు, బుగేశ్వర్‌, బాలశేఖర్‌, ఏఎన్‌ఎంలు శివశేషమ్మ, సరస్వతి, పుష్ప, రామేశ్వరి, పుష్పలత, కరుణమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

అదేవిధంగా, ప్రపంచ మలేరియా దినోత్స వాన్ని పురస్కరించుకొని శుక్రవారం మక్తల్‌ పట్టణంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా వైద్యులు మాట్లాడుతూ మలేరియా ని ర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల ద్వారానే మలేరియా వ్యాపిస్తుందన్నారు. కార్యక్రమంలో వైద్యులు తిరుపతి, హబీబ్‌, వినోద్‌, సాయిబాబా, మల్లికార్జున్‌, శ్రీలత, శ్రీధర్‌కుమార్‌, సులోచన తదితరులు పాల్గొన్నారు.

మరికల్‌ మండల కేంద్రంలో డాక్టర్‌ రాఘవేం ద్రరెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మలేరియా నివారణపై గ్రామ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంఽధీ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:20 PM