సీడ్ పత్తి రైతులకు న్యాయం చేయాలి
ABN, Publish Date - Jul 07 , 2025 | 11:05 PM
జిల్లాలోని సీడ్ పత్తి రైతులకు సరైన న్యాయం జరిగే వరకు వారి తరఫున బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి డీకే స్నిగ్దారెడ్డి అన్నారు.
బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి డీకే స్నిగ్ధారెడ్డి
ఆర్గనైజర్ల మోసాలపై బీజేపీ మహాధర్నా
గద్వాల టౌన్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని సీడ్ పత్తి రైతులకు సరైన న్యాయం జరిగే వరకు వారి తరఫున బీజేపీ పోరాడుతుందని ఆ పార్టీ జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్‌చార్జి డీకే స్నిగ్దారెడ్డి అన్నారు. కంపెనీలు, రైతులకు మధ్య ఆర్గనైజర్ల పేరుతో రూ.కోట్లు వెనకేసుకున్న దళారులు, నేటికీ కూడా రైతులను మోసగించేందుకు సిద్ధపడటం దు ర్మార్గమని అన్నారు. సీడ్ విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఆంక్షలువిధిస్తున్న కంపెనీల తీరుపై, ఆర్గనైజర్ల వ్యవహారానికి వ్యతిరేకంగా సోమవా రం బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక పాతబస్టాండ్ సర్కిల్‌లో మ హాధర్నా నిర్వహించారు. ధర్నాలో మాట్లాడిన డీకే స్నిగ్ధారెడ్డి, వ్యవసాయ శాఖ నియంత్రణ, చట్టబద్ధమైన నిబంధనలు ఉంటేనే సీడ్ రైతుల కు న్యాయం జరుగుతుందని, ఆ దిశగా అధికా రులపై ఒత్తిడి తెచ్చేందుకు తమ పార్టీ పోరాడు తుందన్నారు. కంపెనీలు తమ వైఖరి మార్చు కుని పూర్తిస్థాయి కొనుగోళ్లు చేపట్టాలని, గత ఏడాది సీడ్ పత్తి ఉత్పత్తులకు సంబంధించి పూ ర్తిస్థాయి చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశా రు. జిల్లాలో సీడ్ పత్తి సాగుకు సంబంధించి ప్ర త్యేక అగ్రిక్లీనిక్‌లు ఏర్పాటు చేసి సాగుదారులకు అవగాహన కల్పించే ఏర్పాటు చేయాలన్నారు. పత్తి పంట పరిశీలన కోసం జిల్లాలో ప్రత్యేక ప్రయోగశాలను అందుబాటులోకి తేవాలన్నారు. అనంతరం రైతులతో కలిసి బీజేపీ నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ బీఎం సంతోష్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సి ల్ సభ్యులు బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, జిల్లామాజీ అధ్యక్షుడు రామచంద్రారె డ్డి, నాయకులు బలిగెర శివారెడ్డి, రామచంద్రా రెడ్డి, రజక జయశ్రీ, నాగేశ్వర్‌రెడ్డి, దేవదాస్, కిష్టన్న ఉన్నారు.
Updated Date - Jul 07 , 2025 | 11:05 PM