కొడంగల్‌లో ఇచ్చిన విధంగానే..ఇక్కడి రైతులకూ పరిహారం
ABN, Publish Date - Jun 03 , 2025 | 11:27 PM
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో ఎంత పరిహారం ఇస్తారో అదే రకమైన పరిహారం మన రైతులకు అందిస్తానని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.
- మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
ఊట్కూర్/నర్వ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు సీఎం నియోజకవర్గమైన కొడంగల్‌లో ఎంత పరిహారం ఇస్తారో అదే రకమైన పరిహారం మన రైతులకు అందిస్తానని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వ్య వసాయ కార్యాలయంలో రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన అనంతరం ఎంపీడీవో కార్యాల యంలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి పరిహారం ఇస్తారో అలాంటి పరిహారం సీఎంను అడిగి రైతులకు ఇప్పిస్తానని అన్నారు. పరిహారంతో పాటు అక్కడ ఉద్యోగాలు ఇస్తే ఇక్కడా ఉద్యోగాలు ఇప్పిస్తానని అన్నారు. ప్రస్తుతం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిచడంతో పాటు, సబ్సిడీతో కూడిన విత్తనాలు అందించి వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. బడు గు, బలహీన వర్గాలతో పాటు రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ చింత రవి, ఎంపీవో ఎంఎల్‌ఎన్ రాజు, ఏవో గణేష్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు బాల్‌రెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యప్రకాష్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజ్ఞేశ్వర్‌రెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
అదేవిధంగా, నర్వ మండల కేంద్రంలోని రైతువేదికలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంగళవారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 51 మంది లబ్ధిదారులకు కల్యా ణలక్ష్మి, 21 మంది బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. అలాగే, ప్రభుత్వం అందజేసిన కంది విత్తనాలను కొందరు రైతులకు ఉచితంగా పంపిణీ చేశారు. వాటిని పండించి ఇతర రైతులకు కూడా అందించాలనే ఉద్ధేశంతో ఈ విత్తనాలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం యాంకి గ్రామంలోని ప్రభుత్వ పాఠ శాల ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో అఖిలారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆలయం పునర్నిర్మాణానికి రూ.7 లక్షల విరాళం అందజేత
మక్తల్ రూరల్ : మక్తల్ పట్టణంలోని యాద వనగర్‌లో కొలువైన పురాతన వేణుగోపాలస్వా మి ఆలయాన్ని పునర్నిర్మించి ఈనెల 8న స్వామి విగ్రహా పునఃప్రతిష్ఠ చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పునఃనిర్మాణానికి రూ.7 లక్షల విరాళం అందజేశారు. మూడురోజుల పాటు జరిగే పునఃప్రతిష్ఠ ఉత్సవాలకు మక్తల్ పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ శ్రీరామ్, కోశాధికారి కట్టా సురేష్, సభ్యులు కోరారు.
వేతన బకాయిలు చెల్లించాలి..
తమకు బకాయి ఉన్న రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని కోరుతూ తెలంగాణ ప్రగతిశీల మునిసిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మునిసిపల్ కార్మికులు మంగళవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి వినతిపత్రం అం దించారు. టీయూసీఐ జిల్లా అధ్యక్షుడు, యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కిరణ్, ఉపాధ్యక్షుడు కొలిమి రాములు, కార్మికులు ఉన్నారు.
Updated Date - Jun 03 , 2025 | 11:27 PM