ఆపరేషన్ సిందూర్ విజయవంతంపై హర్షం
ABN, Publish Date - May 08 , 2025 | 11:14 PM
పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ గురువారం నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
- భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకుల ర్యాలీ
నారాయణపేట, మే 8 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావం తెలుపుతూ గురువారం నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సీవీఆర్ బంగ్లా నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం పాక్ సరిహద్దులో జరిగిన కాల్పుల్లో అసువులు బాసిన భారత వీర జవాన్లకు మౌనం పాటించి, నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప ట్టణ అధ్యక్షుడు ఎండీ.సలీం, మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్ మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశ భద్రతకు నిదర్శనం అన్నారు. దేశంలోని ప్రతీ పౌరుడు భారత సైనికు లకు అండగా నిలవాలన్నారు. మాజీ మార్కెట్ చైర్మన్ సరాఫ్ నాగరాజ్, ఆర్డీవో బోర్డు మెంబర్ పోషల్ రాజేష్, మాజీ కౌన్సిలర్ అలేనూర్ వినో ద్, మారుతి, సూర్యకాంత్, కార్తీక్, మనోజ్, మసి పవన్, గడ్డం వినోద్, బండి ఆనంద్, మజీద్, పాషా, సిద్దన్ లక్ష్మన్, జనార్దన్, హస్నోద్దిన్, మోహన్ తదితరులున్నారు. అలాగే, స్థానిక వినాయక కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థినులు భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ తోటి విద్యార్థినులకు తిలకం దిద్దారు.
Updated Date - May 08 , 2025 | 11:14 PM