ఉత్సాహంగా అంతర్రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు
ABN, Publish Date - Jul 26 , 2025 | 11:25 PM
అంతర్ రాష్ట్ర బాస్కెట్ బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.
- తలపడిన 17 మహిళా జట్లు, 18 పురుషుల జట్లు
అయిజ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అంతర్ రాష్ట్ర బాస్కెట్ బాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అయిజ మాజీ ఎంపీపీ దివంగత తిర్మల్‌రెడ్డి జ్ఞాపకార్థం ఈ పోటీలను జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్‌లో కుటుంబ సభ్యులు గౌతమ్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్‌తో కలిసి నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. శనివారం లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి.
బాలికల విభాగంలో నిజామాబాద్ జట్టు కరీంనగర్‌పై 26 పాయింట్ల ఆధిక్యంతో గెలుపొందింది. సూర్యపేట జట్టు జగిత్యాల జట్టుపై 13పాయింట్లు, హనుమకొండ జట్టు వరంగల్ జట్టుపై 18 పాయింట్లు, మేడ్చల్ జట్టు మహబూబాబాద్ జట్టుపై 22 పాయింట్లు, హైదరాబాద్ జట్టు ఖమ్మం జట్టుపై 12 పాయింట్లు, వికారాబాద్ జట్టు జగిత్యాల జట్టుపై 36 పాయింట్ల ఆధిక్యంతో గెలుపొందాయి.
బాలుర విభాగంలో కరీంనగర్ జట్టు ములుగు జట్టుపై 38 పాయింట్ల ఆధి క్యంతో గెలుపొందింది. నిజామాబాద్ జట్టు కామారెడ్డిపై 8 పాయింట్లు, సూర్యపేట జట్టు జయశంకర్ జిల్లా జట్టుపై 41 పాయింట్లు, రంగారెడ్డి జట్టు ఖమ్మం జట్టుపై 28 పాయింట్లు, మేడ్చల్ జట్టు కామారెడ్డి జట్టుపై 32 పాయింట్ల ఆధి క్యంతో గెలుపొందాయి. ఆదివారం సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రెపరీలు మధు, మహేష్, ప్రశాంత్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నారు.
Updated Date - Jul 26 , 2025 | 11:25 PM