ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉన్నత చదువులకు ఇంటర్‌ విద్యే కీలకం

ABN, Publish Date - Jun 18 , 2025 | 11:21 PM

భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలంటే ఇంటర్‌ విద్యే అత్యంత కీలకమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల సర్కిల్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలంటే ఇంటర్‌ విద్యే అత్యంత కీలకమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఇంటర్‌ ప్రభుత్వ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. కష్టపడి చదివించి తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశయాలను ప్రతి విద్యార్థి నెరవేర్చాలని సూచించారు. లక్ష్యసాధనలో ముందుండాలని పేర్కొన్నారు. అధ్యాపకులు బోధనతో పాటు పాఠ్యాంశ విషయంలో ఇచ్చే ప్రతి సూచనలు పాటించాలని తెలిపారు. ప్రైవేట్‌ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను బోలోపేతం చేయడంతో పాటు అన్నీ నాణ్యమైన వసతులు కల్పిస్తోందని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థులకు కల్పించే ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యను విద్యార్థులు అదృష్టంగా భావించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన చాలా మంది ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని, ప్రభుత్వ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులకు జీవితంలో ఆత్మవిశ్వాసంతో పాటు ధైర్యాన్ని నింపుతోందని తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో ఎంపీసీలో 991 మార్కులు సాధించిన సంధ్యకు ప్రోత్సాహక బహుమతిగా రూ.30 వేలు అందజేయడంతో పాటు విద్యార్థినికి భవిష్యత్తు చదువులకు ఆర్థిక భరోసా ఇచ్చిన గద్వాల పుర మాజీ ఛైర్మన్‌ జి వేణుగోపాల్‌ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసి, కొత్తగా కొలువైన అధ్యాపకులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి అభినందలు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐ ఈవో హృదయరాజు, ప్రిన్సిపల్స్‌ వీరన్న, కృష్ణ, కళాశాల అకాడమిక్‌ గైడెన్స్‌ అండ్‌ మానటరింగ్‌ ఆఫీసర్‌ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ జంబు రామన్‌గౌడ, పుర మాజీ ఛైర్మన్‌ వేణుగోపాల్‌, మాజీ వైస్‌ ఛైర్మన్‌ బాబర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:21 PM