ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇన్సులిన్‌ ఇస్తలేరు

ABN, Publish Date - Jul 08 , 2025 | 11:33 PM

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాయి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.

మెడికల్‌ కళాశాల సమీపంలో ఉన్న సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ భవనం

- ఏడు నెలలుగా నిలిచిన సరఫరా

- ఇబ్బంది పడుతున్న టైప్‌ -1 షుగర్‌ బాధితులు

- ప్రైవేటులో కొనుగోలుతో రోగులపై ఆర్థిక భారం

వనపర్తి వైద్యవిభాగం, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నాయి. కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఫలితంగా రోగులు ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించక తప్పడం లేదు. డయాబెటిస్‌ రోగులను గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో వనపర్తి జిల్లాలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ‘మిషన్‌ మధుమేహ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా జిల్లాలో 30 సంవత్సరాలు పైబడి న 3,04,215 మందికి షుగర్‌ పరీక్షలు చేయిం చారు. వారిలో 19,643 మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్న ట్లు అధికారులు గుర్తించారు. వారికి అవసరమైన మందుల ను ఉచితంగా అందిస్తున్నారు. వారిలో టైప్‌-1 డయాబెటిస్‌ బాధితులకు ఇన్సులిన్‌తో మా త్రమే షుగర్‌ కంట్రోల్‌ చేయా ల్సి ఉంటుంది. దాదాపు 300లకు పైగా షుగర్‌ లెవల్‌ ఉండే వారు తప్పకుండా ఇన్సులిన్‌ తీసుకోవా లి. కానీ ఏడు నెలలుగా సరఫరా కావడం లేదు. దీంతో ఇన్సులిన్‌ అవసరమైన టైప్‌-1 బాధితులు 56 మంది ప్రైవేటులో కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో వారిపై ఆర్థిక భారం పడుతోంది.

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో ఫ్రిజ్‌ల కొరత

వనపర్తి జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో ఇన్సులిన్‌ నిల్వ ఉంచడానికి ఫ్రిజ్‌ల కొరత ఇబ్బందిగా మారింది. దాదాపు 1000 లీటర్లకు పైగా సామర్ధ్యం ఉన్న ఫ్రిజ్జులు అవసరం కాగా, 300 లీటర్ల సామర్థ్యం కలిగిన ఒకే ఒక్క ఫ్రిజ్‌ ఉంది. దీంతో చేసేదేమీ లేక జిల్లాకు అవసరమైన ఇన్సులిన్‌ను నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌ నగర్‌లలో నిల్వ ఉంచుతున్నారు. అవసర మైనప్పుడు అక్కడి ఉంచి తెప్పించుకుం టున్నారు. సామర్థ్యానికి సరిపడా ఫ్రిజ్‌లు ఉంటే టీటీ, ఆక్రిటోసిన్‌, మిథైల్‌ ఎర్గో మెట్రిన్‌, రేబిస్‌ వ్యాక్సిన్‌, యాంటీ స్నేక్‌ వీనమ్‌, ఇన్సులిన్‌ తదితరాలను అవ సరమైన మేర స్థానికంగా నిల్వ ఉంచుకునే అవకాశం ఉంటుంది.

కోల్డ్‌ స్టోర్‌ రూం ఏర్పాటుకు చర్యలు

సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో కోల్ట్‌ స్టోర్‌ను ఏర్పాటుకు ఒక గదిని సిద్ధం చేస్తున్నారు. అందుకోసం అవసర మైన పనులు జరుగుతున్నాయి. కోల్డ్‌ స్టోర్‌ ఏర్పాటైతే ఫ్రిజ్‌ల అవసరం ఉండక పోవచ్చు. కానీ పనుల్లో జాప్యం జరుగుతుండటం సమస్యగా మారింది.

ఇండెంట్‌ పెట్టి త్వరలోనే తెప్పిస్తాం

ఇన్సులిన్‌ సరఫరా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. అయినప్ప టికీ జిల్లాలోని టైప్‌-1 డయా బెటిస్‌ షేషంట్లను దృష్టిలో పెట్టుకుని ఇండెంట్‌ పెట్టి త్వరలోనే ఇన్సులిన్‌ వ్యాక్సిన్‌ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. టెండర్‌ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలతో ఇన్సులిన్‌ పంపిణీలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. ఏదేమైనా జిల్లాకు మాత్రం అతి త్వరలోనే ఇన్సులిన్‌ తెప్పించి షుగర్‌ పేషెంట్లకు ఇస్తామని తెలిపారు.

- డాక్టర్‌ అల్లే శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

Updated Date - Jul 08 , 2025 | 11:33 PM