ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలి

ABN, Publish Date - May 09 , 2025 | 11:01 PM

రబీ సీజన్‌ సందర్భంగా ధాన్యం ఇతర రాష్ట్రాల నుంచి పేట జిల్లాలోకి రాకుండా బోర్డర్‌ చెక్‌పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌ అన్నారు.

చెక్‌పోస్టు వద్ద సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌

- ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌

నారాయణపేటరూరల్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌ సందర్భంగా ధాన్యం ఇతర రాష్ట్రాల నుంచి పేట జిల్లాలోకి రాకుండా బోర్డర్‌ చెక్‌పోస్టుల వద్ద పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని ఎస్పీ యోగేశ్‌ గౌతమ్‌ అన్నారు. శుక్రవారం పేట మండలంలోని జలాల్‌పూర్‌ చెక్‌పోస్టును ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేసే విధానాన్ని, వాహన నెంబర్ల నమోదు రిజిస్టర్‌ను పరిశీలించి, భద్రతాపరమైన సూచనలు చేశారు. కర్ణాటక నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా పేట జిల్లా పరిధిలో ఆరు బార్డర్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, వ్యాపారులు పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దన్నారు. చెక్‌పోస్టుల వద్ద సమస్యల గురించి తెలుసుకున్నారు. పేట సీఐ శివశంకర్‌, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 09 , 2025 | 11:01 PM