బైనపల్లిలో ధాన్యం కొనుగోళ్ల తనిఖీ
ABN, First Publish Date - 2025-05-28T23:12:24+05:30
ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారి ప్రశాంత్ జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం బైనపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవకతవకలపై విచార ణ చేపట్టారు.
- గ్రామంలోని కొనుగోలు కేంద్రం నిర్వాహకుడిపై రైతుల ఆరోపణలు
- వివరాలు సేకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు
అయిజ, మే 28 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండలం బైనపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొంతకాలంగా అవకతవకలు జరుగుతున్నాయి. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయలసీమ నుంచి వడ్లను దిగుమతి చేసుకుని కొనుగోలు కేంద్రం లో విక్రయిస్తూ కేంద్రం నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. నాగల్‌దిన్నె, పులికల్ వంతెన మీదుగా ఈ తతంగం సాగుతోంది. ఈ వ్యవ హారంపై విషయాన్ని పలుమార్లు ఆంధ్రజ్యోతి పత్రికలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయి తే బుధవారం ఈ తతంగం కాస్త బట్టబయలయ్యింది. బైనపల్లి గ్రామానికి చెందిన అలీ అనే వ్యక్తి వరి పంట వేయకపోయినా, రాయలసీమ నుంచి 170బస్తాలు తెచ్చి తన ఇంట్లో ఉంచుకున్నాడు. బుధవారం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు అతని ఇంటి దగ్గరే ధాన్యం కొనుగోలు చేస్తుండగా తెలుసుకున్న బీఆర్‌ఎస్వీ జిల్లా కన్వీనర్ కురువ పల్లయ్య అక్కడికి వెళ్లి కాంటాను అడ్డుకున్నాడు. జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఈమేరకు ఎన్‌ఫోర్స్‌మెం ట్ అధికారి ప్రశాంత్ అక్కడి చేరుకుని విచార ణ చేపట్టారు. ఏఈవో శివకుమార్, కేంద్ర నిర్వాహకులు నందిని, ఆమె భర్త బ్రహ్మయ్య, సీసీ జయన్న కొనుగోళ్లను పక్కదారి పట్టిస్తున్నారని రైతులు తెలిపారు. వీరిపై చర్యలు తీసుకోవాలని రైతులతో కలిసి కోరారు. దీంతో పూర్తి వివరాలు సేకరించి న అధికారి ప్రశాంత్, అనంతరం మాట్లాడుతూ విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజే స్తామని, వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - 2025-05-28T23:12:25+05:30 IST