కాంప్లెక్స్ భవన నిర్మాణ పనుల పరిశీలన
ABN, Publish Date - Apr 19 , 2025 | 11:12 PM
పేట జిల్లాలోని కొత్త మండ లాలైన కొత్తపల్లి, గుండుమాల్‌లలో మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను శనివారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు.
కొత్తపల్లి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): పేట జిల్లాలోని కొత్త మండ లాలైన కొత్తపల్లి, గుండుమాల్‌లలో మండల కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులను శనివారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. కొత్తపల్లి మండల కేంద్ర సమీపంలో మూడు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న మండల కాంప్లెక్స్ భవన పనులను ఆమె పరి శీలించారు. నిర్మాణానికి అవసరమైన ఇసుకను రెండురోజుల్లో ఇప్పించాలని కొత్తపల్లి తహసీల్దార్ జయరాములును ఆదేశించారు. అనంతరం గుండుమాల్ పీహెచ్‌సీ పక్కన ఉన్న రెండెకరాల స్థలంలో నిర్మిస్తున్న మండల కాంప్లెక్స్ భవనాన్ని ఆమె పరిశీలించారు. ఇక్కడ కూడా ఇసుక సమస్య ఉందని గుత్తేదారు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యకు రెండు, మూడు రోజుల్లో పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు. పీఆర్ ఈఈ హీర్యానాయక్, డిప్యూటీ ఈఈ విలోక్, ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు ఉన్నారు.
Updated Date - Apr 19 , 2025 | 11:12 PM