ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Jun 02 , 2025 | 11:34 PM
ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అధికారులను ఆదేశించారు.
- ఎక్కడ కూడా అవకతవకలు జరుగకుండా చూసుకోవాలి
- కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
కోస్గి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతీ నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని సర్జఖాన్‌పేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల అధికారులు గ్రా మాల్లో ప్రతీ ఇంటికి తిరిగి ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా సరైన లబ్ధిదారులకు మా త్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా చూసుకోవాలన్నారు. లబ్ధిదారులు సైతం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకో వాలన్నారు. అంతకుముందు మండల నాయ కులు బిజ్జారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో నారా యణపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ వార్ల విజయ్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్దన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిప్రసాద్‌రెడ్డి, సర్జఖాన్‌పేట మాజీ సర్పంచ్ హరీశ్, నాయకులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం
మద్దూర్, కొత్తపల్లి : గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని కాం గ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి అన్నారు. మద్దూర్ నుంచి వయా రెనివట్ల, మోమినాపూర్, అలాగే మద్దూర్ నుంచి ఖాజీపూర్ శివారుతో పాటు, కొత్తపల్లి మండలంలోని భూనీడు నుంచి వింజమూర్ శివారు వరకు చేపట్టే రోడ్డు విస్తరణ పనులకు ఆయన కాడా అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి సోమవారం శంకుస్థాపనలు చేశారు. పీఏసీఎస్ అధ్యక్షుడు న ర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి మాజీ ఎంపీపీ సంజీవ్, మహేందర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, హన్మిరెడ్డి, వీరేష్‌గౌడ్, మండల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 11:34 PM