‘ఇందిర సౌర గిరి జల వికాసం’ ఒక వరం
ABN, Publish Date - May 14 , 2025 | 11:20 PM
నల్లమల గిరిజనులకు ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట టౌన్, మే 14 (ఆంధ్రజ్యోతి) : నల్లమల గిరిజనులకు ఇందిరా సౌరగిరి జలవికాసం పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న నల్లమల పర్యటనకు వస్తున్న సందర్భంగా బుధవారం అచ్చంపేట పట్టణంలోని ఓ పంక్షన్‌హాల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 2.10 లక్షల మంది గిరిజన రైతుల భూములకు విద్యుత్, సాగునీటి సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి పథకాన్ని దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, సీనియర్ నాయకుడు బాలాజీ, మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, నాయకులు మోపతయ్య, మల్లేశ్, శ్రీనివాసులు, వెంకట్‌రెడ్డి, నర్సయ్య యాదవ్, కట్ట అనంతరెడ్డి, రామనాథం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 14 , 2025 | 11:20 PM