రూ.లక్షలు విలువ చేసే కలప అక్రమ రవాణా
ABN, Publish Date - Mar 18 , 2025 | 11:01 PM
మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలోని జూలపల్లి అటవీ సెక్షన్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. జూలపల్లి, కొండాపూర్ అటవీలో లక్షల రూపాయల విలువ చేసే కలపను అక్రమంగా రవాణా చేసిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి.
విచారణలో అవినీతి బయట పడటంతో వేటు
మహమ్మదాబాద్, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మహమ్మదాబాద్ రేంజ్ పరిధిలోని జూలపల్లి అటవీ సెక్షన్ అధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. జూలపల్లి, కొండాపూర్ అటవీలో లక్షల రూపాయల విలువ చేసే కలపను అక్రమంగా రవాణా చేసిన విషయమై ‘ఆంధ్రజ్యోతి’లో ఇటీవల వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. దాంతో అధికారులు విచారణ చేపట్టారు. మహ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్ హై, ఆమల్‌గల్ అటవీ ఆధికారులు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సమగ్ర విచారణ చేసి, నివేదికను డీఎ్‌ఫవోకు సోమవారం అందించారు. జిల్లా అటవీ అఽధికారి సత్యనారయణ ఆ నివేదికను కన్జర్వేటర్‌కు అందించారు. ఆ నిదివేదికతో పాటు ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలను అందించారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన కన్జర్వేటర్ జూలపల్లి సెక్షన్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఎ్‌ఫవో సత్యనాయణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - Mar 18 , 2025 | 11:01 PM