చేయూతనిస్తే అద్భుతాలు ఫలితాలు
ABN, Publish Date - May 31 , 2025 | 11:05 PM
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేయూతనిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మే 31 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చేయూతనిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పదో తరగతి పాసైన విద్యార్థులకు ఎమ్మెల్యే సౌజన్యంతో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి విద్యార్థులు భారీగా వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదిలో మీరు సాధించిన ఫలితాలు కార్పొరేట్‌లో చదివిన విద్యార్థులతో సమానంగా వచ్చాయన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి డిజిటల్ బోర్డులతో పాటు పదో తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ స్డడీ మెటీరీయల్స్‌ను ఉచితంగా అందజేసినట్లు తెలిపారు. దీంతో 20 నుంచి 30 శాతం ఫిలితాలు పెరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సారి మరింత శ్రద్ధ వహించి ఏఎంవో, సీఎంవో, ఎంఈవో, డీఈవోల కోఆర్డినేషన్‌తో పనిచేసి మరింత మెరుగ్గా ఉత్తీర్ణ శాతం పెంపొందించాలని కోరారు. విద్యార్థులు పత్రికలు చదివితే మరింత జ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. గత విద్యాసంవంత్సరం ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ ఫస్ట్ నవరత్నాలు ఆధ్వర్యంలో ఇచ్చిన ఎంసెట్, నీట్ కోచింగ్ పొందిన విద్యార్థులకు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలలో 114 మందికి రాష్ట్ర స్థాయి ర్యాంకులు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఎలాంటి వసతులు కావాలన్న తప్పక కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం 500 మార్కులు పైన వచ్చిన విద్యార్థులను సన్మానించారు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, డీఈవో ప్రవీణ్‌కుమార్, డీఐఈవో కౌసర్ జహాన్, బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ భగవంత్ చారి, సీఎంవో బాలుయాదవ్, ఏఎంవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
కోయిలకొండ ఎక్స్‌రోడ్ జంక్షన్ పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్ : చించోళి హైవే పనుల్లో భాగంగా రూ.65.50 లక్షలతో కోయిలకొండ ఎక్స్‌రోడ్ జంక్షన్ పనులను శనివారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ను ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత, మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, నాయకులు మహేందర్, బుద్దారం సుధాకర్‌రెడ్డి, గుండా మనోహర్ పాల్గొన్నారు.
Updated Date - May 31 , 2025 | 11:05 PM