ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధరను నిర్ణయిస్తే రైతు బాగుపడినట్లు

ABN, Publish Date - May 14 , 2025 | 10:55 PM

రైతు పండించే పంటను తనకు తానుగా ఏనాడైతే ధరను నిర్ణయిస్తాడో అప్పుడే రైతు బాగుపడినట్లు అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

నర్వ, మే 14 (ఆంధ్రజ్యోతి): రైతు పండించే పంటను తనకు తానుగా ఏనాడైతే ధరను నిర్ణయిస్తాడో అప్పుడే రైతు బాగుపడినట్లు అని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నర్వ మండలం ఉందెకోడ్‌ గ్రామంలోని రైతు వేదికలో అమాలిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. రైతు ఉన్నతి కోసం, బాగు కోసం తాను వారి వెంటే ఉంటానని అన్నారు. రైతుల బాగు కోసం పనిచేస్తున్న ఉందెకోడ్‌ అమాలిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ వారిని అభినందిస్తు కంపెనీ వారికి తన సహాయ, సహకారాలు ఎల్లవేళలా ఉంటానని అన్నారు. సమావేశంలో జిల్లా అగ్రికల్చర్‌ అధికారి జాన్‌ సుధాకర్‌, తహసీల్దార్‌ మల్లారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఏవో అఖిలరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, అధికారులు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు చెన్న య్యసాగర్‌, కిసాన్‌ సెల్‌ మండల అధ్యక్షుడు బద్దిపల్లి రాజారెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

డయాలసిస్‌ కేంద్రం ప్రారంభం

మక్తల్‌ : మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులతో కూడిన డయాలసిస్‌ కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.1.40 కోట్లతో ఈ డయా లసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేవలం హామీలకే పరిమితం చేశారన్నారు. త్వరలో 150 పడ కల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అనంతరం డయాలసిస్‌ సెంటర్‌ సిబ్బందిని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వినిత, పుర కమిషనర్‌ శంకర్‌నాయక్‌, సిబ్బంది యాదగిరి, లింగప్ప పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 10:56 PM