వర్షమొస్తే.. నరకయాతనే
ABN, Publish Date - Jul 20 , 2025 | 11:28 PM
ఎటూ చూసినా గుంతలు పడి వాహనదారులే కాదు.. పాదాచారులు సైతం నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిడ్జిల్, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ఎటూ చూసినా గుంతలు పడి వాహనదారులే కాదు.. పాదాచారులు సైతం నడవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని ఈదులబాయితండా గ్రామ పంచాయతీ కాటోనిగడ్డ తండాకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. మసిగుండ్లపల్లి నుంచి కాటోనిగడ్డతండాకు రెండు కిలో మీటర్ల మేర రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో తండావాసులకు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం వస్తే చాలు రోడ్డు మొత్తం బురదమయమై ద్విచక్రవాహనదారులు కిందపడిన సంఘటనలు కోకొల్లలు. ఎన్నిలప్పుడు తాము అధికారంలోకి వస్తే బీటీరోడ్డు వేస్తామని చెప్పిన నాయకులు నేటికీ హామీలు నెరవేర్చలేనదని పలువురు మండిపడుతున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చొరవచూపి బీటీరోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - Jul 20 , 2025 | 11:28 PM