ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంత్రి పదవిని బాధ్యతతో నిర్వర్తిస్తా

ABN, Publish Date - Jun 17 , 2025 | 11:23 PM

తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద బాధ్యతలను అప్పగించిందని, దానిని బాధ్యతతో నిర్వర్తిస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.

గజమాలతో మంత్రికి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్‌ శ్రేణులు

- హంగూ.. ఆర్భాటాల్లేకుండా పాలమూరు అభివృద్ధికి కృషి

- రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్‌నగర్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): తనపై ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్ద బాధ్యతలను అప్పగించిందని, దానిని బాధ్యతతో నిర్వర్తిస్తానని రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ల బ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని, చివరి వరుసలో ఉన్న లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయడమే తన కర్తవ్యమని చెప్పారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మొదటిసారి మహబూబ్‌నగర్‌కు వచ్చారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులు, ముదిరాజ్‌ సోదరులు ఘన స్వాగతం పలికారు. ముందుగా పద్మావతి కాలనీలోని పండగ సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడినుంచి ర్యాలీగా ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్దకు చేరుకుని అక్కడ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డితో కలిసి అమరుల స్తూపానికి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు గజ మాలతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మాట్లాడారు. సామా న్య కార్యకర్తగా ఉన్న తనకు ఈ రోజు మంచి అవకాశాన్ని పార్టీ కల్పించిం దని తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఆయనకు ఇచ్చిన శాఖలు కూడా జిల్లాలో మెజారిటీ వర్గాలైన ముదిరాజ్‌, యాదవ సోదరులకు సంబంధించిన పశుసంవర్ధక, మ త్య్స శాఖలను అప్పగించడం జరిగిందన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ సహచర ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు మంత్రి ని ఘనంగా సత్కరించారు. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదు ల్లా కొత్వాల్‌, నాయకులు లక్ష్మణ్‌యాదవ్‌, ఆనంద్‌కు మార్‌గౌడ్‌, సంజీవ్‌ ముదిరాజ్‌, వినోద్‌కుమార్‌, ఎన్‌పీ వెంక టేశ్‌, సీజె బెనహర్‌, అనిత, సిరాజ్‌ ఖాద్రి, జహీర్‌అక్తర్‌ పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళలు గౌరవంగా జీవించేలా చేస్తాం

మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత ్వం ఎన్నో కార్యక్రమా లను అమలుచేస్తోందని, రాష్ట్రంలో మహిళలు గౌరవంగా జీవించడ మే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ప్రతీ పథకం మహిళల పేరునే అమలుచేస్తున్నట్లు చెప్పారు. మంగ ళవారం మహబూ బ్‌నగర్‌లో నైపుణ్య అభివృద్ధి కేంద్రం, సెట్విన్‌ ద్వారా స్వల్పకాల కోర్సులలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ యువజన శాఖ పరిధిలో సెట్విన్‌ ద్వారా మహబూబ్‌నగర్‌లో మహిళల కోసం చేపట్టిన శిక్షణ కార్యక్రమా లను పైలట్‌గా తీసుకొని ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూ బ్‌నగర్‌ కలెక్టర్‌ విజయేందిర బోయి పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2025 | 11:23 PM