ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెత్తకు నిలయం.. కరెంట్‌ ఆఫీసు

ABN, Publish Date - Jul 20 , 2025 | 11:27 PM

ప్రతీరోజు ఆటోలు, ట్రాక్టర్లతో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో చెత్త సేకరిస్తున్నారు.

ఓల్డ్‌ పవర్‌ హౌజ్‌ వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారం

- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

పాలమూరు, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ప్రతీరోజు ఆటోలు, ట్రాక్టర్లతో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో చెత్త సేకరిస్తున్నారు. అయినప్పటికీ కొన్నిచోట్ల చెత్త గుట్టలు గుట్టలుగా నిల్వ ఉంటోంది. అక్కడే మల, మూత్ర విసర్జన చేయటంతో ఇబ్బందిగా మారుతోంది. పట్టణంలోని ఓల్డ్‌ పవర్‌ హౌజ్‌ కార్యాలయం చెత్త పారవేయడానికి, మల, మూత్ర విసర్జనకు నిలయంగా మారింది. పక్కనే అంబాభవాని ఆలయం, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఉన్నప్పటికీ కొందరు చెత్తను యథేచ్ఛగా పారవేస్తున్నారు. మోటార్‌ లైన్‌లోని వ్యాపారస్థులకు రెగ్యులర్‌గా చెత్తసేకరణకు ట్రాక్టర్లు రెండు సార్లు వస్తున్నా.. కరెంటు ఆఫీసు దగ్గరే వేస్తున్నారు. చెత్త అధికమైనప్పుడు కాల్చటంతో పక్కనే సబ్‌స్టేషన్‌ ఉండటంతో ప్రమాదం జరిగితే నష్టాన్ని ఊహించలేమని విద్యుత్‌శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ స్థలం వరకు కంచె వేయాలని ప్రయత్నించినా.. ఎవరి స్థలం ఎక్కడి వరకు ఉంటే తేలకుండా కోర్టు పరిధిలో ఉంది.

Updated Date - Jul 20 , 2025 | 11:27 PM