ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంట మార్పిడితో అధిక దిగుబడులు

ABN, Publish Date - May 08 , 2025 | 11:54 PM

పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చ ని పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్లు నళి ని, శంకర్‌ రైతులకు సూచించారు.

వనపర్తి : రైతులకు కరపత్రాలను అందజేస్తున్న వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు

- అవసరం మేరకే రసాయన ఎరువులు

- వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు

- గద్వాల, వనపర్తి జిల్లాల్లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

గద్వాల/ వనపర్తి రూరల్‌, మే 8 (ఆంధ్రజ్యోతి) : పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చ ని పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్లు నళి ని, శంకర్‌ రైతులకు సూచించారు. జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో గురువారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవే త్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గద్వాల మండ లం కొండపల్లి గ్రామంలో నిర్వహించిన సదస్సులో శా స్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడి కోసం ఎక్కువ మోతాదులో యూరియా, రసాయన ఎరువుల ను వినియోగిస్తున్నారన్నారు. అవసరం మేరకే వాటిని వాడాలన్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. సస్యరక్షణ చర్యలతో తెగుళ్లను నివారించవచ్చని సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, వ్యవసాయంలో యంత్రాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని, సాగునీటిని పొదుపుగా వాడుకో వాలని సూచించారు. హార్టీకల్చర్‌ అధికారి అక్బర్‌ మా ట్లాడుతూ పండ్ల తోటల పెంపకంతో రైతులు దీర్ఘకాల ఆదాయం పొందొచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, తెలంగాణ సీడ్‌ అధి కారి ఆదినారాయణ, అయిల్‌ పామ్‌ ఫెడరేషన్‌ అధికా రి శశిధర్‌ గౌడ్‌, విస్తరణ అధికారి అనూష పాల్గొన్నారు.

తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధి

పంటలలో తెగుళ్ల నివారణకు విత్తనశుద్ధిని కచ్చితం గా పాటించాలని పాలెం వ్యవసాయ కళాశాల శాస్త్ర వేత్తలు సూచించారు. వనపర్తి జిల్లా, మండల పరిధి లోని కిష్టగిరి గ్రామంలో గురువారం ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రాజారెడ్డి, ఉమ, మ హేశ్‌, శ్రీరాములు, ఉద్యాన శాఖ అధికారి శివతేజ మా ట్లాడారు. వివిధ పంటలలో యాజమాన్య పద్ధతులు, రసాయనిక ఎరువుల వాడకం, పురుగు మందుల పిచి కారి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిం చారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి వచ్చే పంటలు సాగు చేయాలన్నారు. విత్తనాలను కొన్నప్పుడు రశీదు లు తీసుకొని భద్రపరుచుకోవాలని సూచించారు. పంట ల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచన లు పాటించాలని చెప్పారు. భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట పైరులైన జీలుగ, జనుము, పిల్లిపెసరలను 40 రోజులు ముందుగానే వేసుకుని, పూత దశలో కలి య దున్నాలన్నారు. అలాగే కోతల అనంతరం కొయ్య లను కూడా భూమిలో కలియదున్నాలని సూచించారు. అనంతరం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడినిచ్చే సూత్రాలకు సంబంధించిన కరపత్రాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, ఏఈవో యుగంధర్‌, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:54 PM