మక్తల్‌లో భారీ వర్షం
ABN, Publish Date - May 18 , 2025 | 10:59 PM
మక్తల్ పట్ట ణంతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం 5 నుంచి 6:30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
మక్తల్, మే 18 (ఆంధ్రజ్యోతి): మక్తల్ పట్ట ణంతో పాటు, మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం సాయంత్రం 5 నుంచి 6:30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని వివిధ కార్యాలయాల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పడమటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద వర్షపునీరు ఆలయంలోకి చేరింది. జక్లేర్, గుడిగండ్ల, మంథన్‌గోడ్, గోలపల్లి, కాచ్వార్, కాట్రేవ్‌పల్లి తదితర గ్రామాల్లో భారీ వర్షం పడటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని గ్రామాల్లో కల్లాల్లో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు.
Updated Date - May 18 , 2025 | 10:59 PM