ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూత్పూర్‌లో భారీ వర్షం

ABN, Publish Date - Jun 12 , 2025 | 11:19 PM

మండలంలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.

భూత్పూర్‌ రహదారిపై నిలిచిన నీరు

భూత్పూర్‌, హన్వాడ నవాబ్‌పేట బాలానగర్‌ జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి) : మండలంలో బుధవారం రాత్రి, గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. 15 రోజులుగా మోఖం చాటేసిన వాన ఒక్కసారిగా కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విత్తుకున్న విత్తనాలకు ఈ వర్షం ఎంతో మేలు చేకూరిందన్నారు. భూత్ఫూర్‌ చౌరస్తాలో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బుదవారం రాత్రి 69 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. హన్వాడ మండలంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. 50.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. వర్షం తగ్గితే జొన్న, మొక్కజొన్న, కంది పంటలు సాగు చేసేందుకు అన్నదాతలు సిద్ధం చేసుకున్నారు. నవాబ్‌పేట మండలంలో బుధవారం రాత్రి గురువారం యన్మన్‌గండ్ల, సిద్దిట్టం, కాకర్లపాడు, నవాబ్‌పేట గ్రామాలతో పాటు బాలానగర్‌ మండలంలో భారీ వర్షం కురింది.

తడిసిన ధాన్యం

రాజాపూర్‌ : మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలో స్థానిక డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని మళ్లీ ఆరబెట్టాలని కొనుగోలు దారులు సూచించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 11:19 PM