ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హెడ్‌కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

ABN, Publish Date - Jun 04 , 2025 | 10:58 PM

సివిల్‌ విషయాలలో తలదూర్చి, వివాదాస్పద భూములను తక్కువ ధరకే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ పోలీస్‌ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

డీఐజీ ఆదేశాల మేరకు ఎస్పీ చర్యలు

పాలమూరులో హాట్‌టాపిక్‌గా మారిన ‘ఆంధ్రజ్యోతి’ కథనం

మహబూబ్‌నగర్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): సివిల్‌ విషయాలలో తలదూర్చి, వివాదాస్పద భూములను తక్కువ ధరకే రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నాడన్న ఆరోపణలపై ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ పోలీస్‌ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో విఽధులు నిర్వర్తిస్తున్న సదరు హెడ్‌కానిస్టేబుల్‌ తన గ్రామంలో వివాదాస్పద భూములు, లిటిగేషన్‌ వ్యవసాయ భూములలో తలదూర్చి తక్కువ ధరకు వాటిని సొంతం చేసుకుంటున్నారని ఎస్పీ కార్యాలయానికి పలువురు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఓ బాధిత మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఫిర్యాదుదారులు పేర్కొన్న అంశాలు వాస్తవమేనని డీఐజీకి నివేదిక సమర్పించారు. అప్పులు తీసుకున్నవారు అసలు, మిత్తీడబ్బులు తిరిగి ఇవ్వలేని స్థితిలో తక్కువ ధరకే వారి భూములను సొంతం చేసుకున్నట్లు విచారణలో తేలింది. దీనిపై డీఐజీ ఆదేశాల మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులు సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ మంగళవారమే ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. కాగా ఈ బాగోతంపై ‘ఖాకీ కాఠిన్యం’ పేరిట రెండ్రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. పోలీ్‌సశాఖలో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చిన తరువాత బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

Updated Date - Jun 04 , 2025 | 10:58 PM