ఘనంగా బుద్ధ పూర్ణిమ
ABN, Publish Date - May 12 , 2025 | 11:16 PM
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్‌లో సోమవారం బుద్ధ పూర్ణిమను ఘనంగా నిర్వహించారు.
జడ్చర్ల, మే 12 (ఆంధ్రజ్యోతి) : జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బొటానికల్ గార్డెన్‌లో సోమవారం బుద్ధ పూర్ణిమను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధుడి విగ్రహానికి బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య, కౌన్సిలర్ సతీష్ పూలమాల వేసి నివాళి అర్పించారు. బాలమణి, గోపాల్‌గౌడ్, రాధాకృష్ణ, పరిశోధక విద్యార్థిని రమాదేవి, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు భరత్, నందు పాల్గొన్నారు.
బుద్ధుని ఆశయాలతో పనిచేద్ధాం
హన్వాడ : బుద్ధుని ఆశయాలతో ముందుకు సాగుదామని బుద్ధ ఆరామ నిర్మాణ కమిటీ జిల్లా అధ్యక్షుడు బాలకిష్టయ్య పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని బుద్దారం గ్రామంలో కమిటీ ఆధ్వర్యంలో బుద్ధ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. బుద్ధుని మార్గంలో యువత పయనించాలన్నారు. అంతకుముందు జెండా ఆవిష్కరించి బుద్ధ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు వివిధ సంఘాల నాయకులు జంబులయ్య, వెంకన్న, గంగాపూరి, చెన్నయ్య, నాగయ్య, డాక్టర్ నాగయ్య, వెంకటేష్, వెంకటయ్య, బీజేపీ నాయకుడు రఘురాంగౌడ్, అనంతరెడ్డి, రాజు, శ్రీహరి, గట్టు రాములు, కిరణ్, బాలయ్య పాల్గొన్నారు.
పాలమూరు : వైశాఖ పౌర్ణమిరోజే సిద్ధార్థ జననం, బుద్ధుడి జ్ఞానోదయం, మహాపరి నిర్యాణం పొందారని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం బుద్ధ పౌర్ణమిని జిల్లా కేంద్రంలోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ హాజరై పంచశీల జెండావిష్కరించి, ప్రసంగించారు. మూడ నమ్మకాలకు తావులేకుండా శాస్త్రీయ దృక్ఫథంతో హేతుబద్ధంగా ఆలోచించినప్పుడే జీవమనుగడ, ఉనికికి, అభివృద్ధి సాధ్యమన్నారు. మహమాయ బుద్ధ విహార అధ్యక్షుడు ఆది లక్ష్మయ్య, బీఎస్‌ఐ నిర్వాహకులు గడ్డమీది గోపాలకృష్ణ, రామలింగం, బుర్ర సురేష్, అశోక్‌కుమార్, వెంకట్రాములు, జీవరత్నం, అరుణ్‌కుమార్, దినేష్, ఎర్ర నరసింహా, కురుమయ్య, లక్ష్మణ్, జ్యోతి, బత్తిని రాము, నాచ శ్రీనివాస్‌యాదవ్, పులిజాల రవికిరణ్, గొండ్యాల రమేష్ పాల్గొన్నారు.
Updated Date - May 12 , 2025 | 11:16 PM