ముగిసిన హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరం
ABN, Publish Date - Jun 10 , 2025 | 11:24 PM
మండలంలోని కోడ్గల్ జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో 40 రో జుల పాటు నిర్వహించిన హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది.
జడ్చర్ల, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కోడ్గల్ జడ్పీహెచ్‌ఎస్ ఆవరణలో 40 రో జుల పాటు నిర్వహించిన హ్యాండ్‌బాల్ శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్‌నాయక్, క్రీడాకారిణి రోజ పాల్గొన్నారు.
మిడ్జిల్ : మండలంలోని వస్పుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హ్యాండ్‌బాల్ పోటీలు ముగిశాయి. జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి శంకర్‌నాయక్ పాల్గొని మాట్లాడారు. క్రీడాకారుడు అభిలాష్ శిక్షకుడిగా వ్యవహరించారు.
భూత్పూర్ : మునిసిపాలిటీలోని స్వామి వివేకానంద విద్యాలయంలో పాఠశాల కరస్పాం డెంట్ నర్సిములు వేసవి సెలవుల్లో వివిధ కో ర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. మంగళ వారం ముగింపు కార్యక్రమానికి పలువురు నా యకులు పాల్గొని అభినందించారు.
Updated Date - Jun 10 , 2025 | 11:24 PM