ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి

ABN, Publish Date - May 29 , 2025 | 11:03 PM

ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు ఆదేశించారు.

బాదేపల్లి పత్తి మార్కెట్‌లో ధాన్యం తేమశాతాన్ని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు

జడ్చర్ల, మే 29 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ నిబంధనల మేరకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు ఆదేశించారు. బాదేపల్లి పత్తి మార్కెట్‌లో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్ర్నాన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి రైతులు తెచ్చిన ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. అనంతరం బాదేపల్లి పత్తి మార్కెట్‌ ప్రాంగణంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను పరిశీలించారు. మూడు నెలల రేషన్‌ కోటాను ఒకే సారి పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు, బియ్యం కోటాను రేషన్‌ దుకాణాలకు సరఫరా చేయాలని నయాబ్‌ తహసీల్దార్‌ బాలప్రసాద్‌కు సూచించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి డీఎం రవినాయక్‌, తహసీల్దార్‌ నర్సింగ్‌రావు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నయాబ్‌ తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

బాలానగర్‌ : మండల కేంద్రంతో పాటు ఉడిత్యాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్‌ మోహన్‌రావు తనిఖీ చేశారు. తూకం వేసిన ధాన్నాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. డీఎస్‌వో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2025 | 11:03 PM