ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జీపీవో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ABN, Publish Date - May 22 , 2025 | 11:04 PM

గ్రామపాలన అధికారులు(జీపీవో) పరీక్షను పక డ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు.

జీపీవోల పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

- అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

నారాయణపేట టౌన్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): గ్రామపాలన అధికారులు(జీపీవో) పరీక్షను పక డ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో జీపీవో పరీక్షలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరిగే పరీక్షకు 109 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. నారాయణపేటలోని వేద సరస్వతి జూనియర్‌ కళాశాలలో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు హాల్‌ టికెట్లపై హెచ్‌వోడీ అటెస్టు చేయించాలన్నారు. అలాగే ఐడీ ప్రూఫ్‌ తీసుకొని పరీక్షకు హాజరు కావాలని, హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9154283913కు ఫోన్‌ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఎస్పీ ఆధ్వర్యంలో బం దోబస్తు ఉంటుందని తెలిపారు. ఆర్డీవో పరీక్షను పర్యవేక్షిస్తారన్నారు. డీఐఈఓ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నోడల్‌ అధికారులు, డీఎంహెచ్‌వో, విద్యుత్‌, మునిసిపల్‌ శాఖలకు ప నుల కేటాయింపులు చేశారు. డీటీవో హరిప్రసాద్‌, ఏవో జయసుధ, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 22 , 2025 | 11:04 PM