ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

ABN, Publish Date - May 08 , 2025 | 11:12 PM

రైతులు కష్ట పడి పండించిన ధాన్యం కొనుగోలులో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని గద్వాల నియోజక వర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి బాసు హను మంతునాయుడు అన్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడు హనుమంతునాయుడు

ధరూరు, మే 8 (ఆంధ్రజ్యోతి): రైతులు కష్ట పడి పండించిన ధాన్యం కొనుగోలులో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని గద్వాల నియోజక వర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి బాసు హను మంతునాయుడు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లే దని విమర్శించారు. గురువారం ధరూర్‌ మండ లం అల్లపాడు గ్రామంలోని ఐకేపీ కేంద్రంలో డంపింగ్‌ చేసిన వరి ధాన్యాన్ని పార్టీ నాయకుల తో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆ య న మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పంచిడిన పంట కొనేదిక్కులేక రైతులు తీవ్ర ఆందోళ చెం దుతున్నారన్నారు. హైదరాబాద్‌లో అందాల పో టీల సమీక్షలు చేస్తున్నసీఎం అన్నదాత సమస్య లను పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం కొను గోలు కేంద్రాలకు ప్రభుత్వం గన్నీబ్యాగులు ఇ చ్చేపరిస్థితి లేదన్నారు. చిల్లర మాటలు తగ్గించి ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించి సమస్యలు పరిష్కరించాలన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప దేళ్లలో కరోనా వచ్చినా, నోట్ల రద్దు అయినా ఏరోజు కూడా రైతులకు రైతుబంధు ఆపలేదని గుర్తుకుచేశారు. ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన ఘనత తమ పార్టీదేదన్నారు. కేసీఆర్‌ హయాంలో ధాన్యం కొనుగోలులో ఎన్నడూ ఇంత ఆలస్యం జరగలేద ని, కాంగ్రెస్‌ పాలనలో ప్రభుత్వం రైతుల నుంచి తరుగు పేరుతో ఐదు కేజీల ధాన్యం కోత విధి స్తుందని మండిపడ్డారు. తక్షణమే ధాన్యం కొను గోలు చేయకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో చక్రధర్‌రావు, డి.శేఖర్‌ నా యుడు, నూర్‌పాషా, వెంకటేశ్‌నాయుడు, వెంక టేశ్వర్‌ రెడ్డి, కృష్ణారెడ్డి, ముని మౌర్య, నక్క రవి, నరసింహులు, ఆంజనేయులు, రాజు, శ్రీనివాసు లు, తిమ్మప్ప, నల్లగట్టు రాముడు, కామేష్‌, కార్యకర్తలు, రైతులు ఉన్నారు.

Updated Date - May 08 , 2025 | 11:12 PM