డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:08 PM
ఇళ్ల మధ్య ఏపుగా పెరిగిన చెట్లు, పూ డుకుపోయిన కాల్వలు, పేరుకపోయిన చెత్తాచెదారంతో కాలనీ అంతా దుర్గంధం వెదజల్లుతున్నా మునిసిపల్ అధికారులు పట్టించుకోడం లేదు.
- పట్టించుకోని మునిసిపల్ అధికారులు
- ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసకాలనీ వాసులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ఇళ్ల మధ్య ఏపుగా పెరిగిన చెట్లు, పూ డుకుపోయిన కాల్వలు, పేరుకపోయిన చెత్తాచెదారంతో కాలనీ అంతా దుర్గంధం వెదజల్లుతున్నా మునిసిపల్ అధికారులు పట్టించుకోడం లేదు. మునిసిపల్ పరి ధిలోని 12వ వార్డు బండమీదిపల్లిలో గల శ్రీనివాస కాలనీలో కాల్వలు కూలిపోగా, కొత్తవి నిర్మించకపోవడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తో డు కాల్వ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో రాత్రివేళ విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నా యి. స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీకాలం ముగియ డంతో ప్రజలు ఎవరికి విన్నవించుకోవాలో తెలియక ఇబ్బందులతోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి కాల్వల నిర్మాణం చేపట్టి, పిచ్చి మొక్కలను నివారించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Updated Date - Jul 13 , 2025 | 11:08 PM