ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించాలి
ABN, Publish Date - May 30 , 2025 | 11:19 PM
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిలయ్యగౌడ్ డిమాండ్ చేశారు.
నారాయణపేట టౌన్, మే 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అంజిలయ్యగౌడ్ డిమాండ్ చేశారు. ఆయా సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్కు వద్ద రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో వారు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని నిర్వహిస్తున్న తీరును నిరసిస్తూ కలెక్టర్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద జపం చేస్తూ దేశ ప్రజానీకాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఉపాధి కూలీలు పని ప్రదేశంలో ప్రమాదానికి గురైతే ఉచిత వైద్యం, మరణిస్తే రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలప్ప, సాయిబాబా, ఎల్లప్ప, రేణమ్మ, కిష్టప్ప, గోవింద్, హను మంతు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్, మహేష్‌లతో పాటు కూలీలు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:19 PM