ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలి

ABN, Publish Date - May 12 , 2025 | 11:13 PM

కార్మికుల మెడకు ఉరితాళ్ల మాదిరగా నాలుగు లేబర్‌కోడ్‌లు నిలిచాయని ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ నాయకులు అన్నారు.

పట్టణంలో ర్యాలీ చేపట్టిన ట్రేడ్‌ యూనియన్స్‌ శ్రేణులు

పాలమూరు, మే 12 (ఆంధ్రజ్యోతి) : కార్మికుల మెడకు ఉరితాళ్ల మాదిరగా నాలుగు లేబర్‌కోడ్‌లు నిలిచాయని ఆల్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ నాయకులు అన్నారు. సోమవారం మోటారు వాహన చట్టం-2019 సవరించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా పట్టణంలో ఆటో ర్యాలీ చేపట్టారు. అనంతరం తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, టీయూసీఐ, బీఆర్‌టీయూ, టీఎన్‌టీయూసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. ఐన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్‌ మాట్లాడుతూ నాలుగు లేబర్‌కోడ్‌లు రద్దు చేయాలని రవాణా రంగం కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. బీఎన్‌ఎస్‌-2023లో సవరించి బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106(1)(2) ఉపసంహరించుకోవాలన్నారు. మహాలక్ష్మి స్కీంతో నష్టపోతున్న ఆటో క్యాబ్‌ డ్రైవర్లకు నెలకు రూ.4500 ఇవ్వాలన్నారు. పోర్టల్‌ స్థానంలో కేంద్రం ప్రకటించిన సహకార యాక్టు వెంటనే అమలు చేయాలన్నారు. దానిలోనే గూడ్స్‌ రవాణా కలపాలన్నారు. 20న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆటోలతో పాటు మోటార్‌ రవాణా రంగంలోని కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నల్లవెల్లి కురుమూర్తి, పి.సురేష్‌, సి.వెంకటేష్‌, ధన్వాడ రాములు, నాగేష్‌, రాజు మాట్లాడారు. కార్యక్రమంలో బాష, చిన్నయ్య, సత్యం, రాజు, వెంకటేష్‌, ఆంజనేయులు, మోహన, దేవానంద్‌, రవి, రాజు, యాదయ్య, బాలు, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2025 | 11:13 PM