లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలి
ABN, Publish Date - May 30 , 2025 | 11:33 PM
లాభదాయక పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు.
- పత్తి పంట దిగుబడిపై కలెక్టర్ ఆరా
నాగర్‌కర్నూల్, మే 30 (ఆంధ్రజ్యోతి) : లాభదాయక పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. శుక్రవారం నాగ ర్‌కర్నూల్ వ్యవసాయ క్లస్టర్ పరిధిలో దేశిటిక్యాల గ్రామంలో రైతు రమేష్‌రెడ్డి తన ఐదెకరాల పొలంలో కొనసాగుతున్న పత్తి విత్తనాలు నాటుతున్న వ్యవ సాయ పనులను కలెక్టర్ బదావత్ బదావత్ సంతోష్ వ్యవసాయ అధికారు లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల నుంచి పంట దిగు బడి సాగుకు వినియోగిస్తున్న పత్తి విత్తనాల రకం, విత్తనాలు, మందుల కొ నుగోలు ఏమైనా సమస్యలు ఎదరవుతున్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకు న్నారు. పత్తి పంటతో పాటు లాభదాయక పంటలు, ఆయిల్‌పామ్ పంట సా గుతో పాటు హార్టికల్చర్ పంటలను కూడా సాగు చేయాలన్నారు. రైతు రమేష్ రెడ్డి గత సంవత్సరం పండించిన పత్తిపంట దిగుబడిని కలెక్టర్‌కు తెలియజే శారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, ఏడీ పూర్ణచంద్రా రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రాజు, రైతులు కృష్ణారెడ్డి, బాల్‌రెడ్డి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 11:33 PM