ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రథమ చికిత్స కేంద్రాలు సీజ్‌

ABN, Publish Date - May 15 , 2025 | 11:23 PM

అ ర్హత లేని వారు ప్రథమ చికిత్స కేంద్రాల్లో పరి మితికి మించి వైద్యం అందించడం నేరమని డీ ఎంహెచ్‌వో శ్రీనివాసులు తెలిపారు.

ఖిల్లాఘణపురం, మే 15 (ఆంధ్రజ్యోతి) : అ ర్హత లేని వారు ప్రథమ చికిత్స కేంద్రాల్లో పరి మితికి మించి వైద్యం అందించడం నేరమని డీ ఎంహెచ్‌వో శ్రీనివాసులు తెలిపారు. మండల కేంద్రంలోని 9 ప్రథమ చికిత్స కేంద్రాలను గురు వారం డీఎంహెచ్‌వో శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేసి సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ... కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఇప్పటి వ రకు 23 ప్రథమ చికిత్స కేంద్రాలను (ఖిల్లాఘణ పురం -9, పాన్‌గల్‌ -2, శ్రీరంగాపూర్‌ -2, బలి జపల్లి-2, పాలెం-2, ఆత్మకూరు-1, వనపర్తి -5) సీజ్‌ చేసినట్లు తెలిపారు. ప్రథమ చికిత్స కేంద్రా ల్లో రోగులకు యాంటీబయోటిక్స్‌, స్టెరాయిడ్స్‌, పెయిన్‌ కిల్లర్‌ టాబ్లెట్స్‌ ఇస్తూ రోగ నిరోధక శక్తి తగ్గుదలకు కారణమవుతున్న ఆర్‌ఎంపీలపై డా క్టర్లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రథ మ చికిత్స కేంద్రాలకు వచ్చే రోగులను కమిషన్ల కోసం ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు సిఫా రసు చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు క్లినిక్‌ బోర్డులు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నా రని అన్నారు. నిబంధనలకు మించి వైద్యం చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు జైలుకు పంపిస్తామని అన్నారు. కార్యక్ర మంలో మెడికల్‌ ఇన్‌చార్జి డెమో సిబ్బంది రవి కుమార్‌, ఆసుపత్రి సూపర్‌వైజర్‌ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2025 | 11:23 PM