పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ABN, Publish Date - Apr 17 , 2025 | 11:33 PM
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంటలను పరిశీలిస్తున్న సీపీఐ నాయకులు
రాజాపూర్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కురిసిన వడగళ్ల వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని గుండ్లపోట్లపల్లి గ్రా మంలో పర్యటించి పంటలను పరిశీలించి, ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, సత్యనారాయణరెడ్డి, ఆంజనేయులు, యాదగిరి, కృష్ణ యాదవ్, మహేష్, నర్సింములు, హనుమంత్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 11:33 PM