ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలి

ABN, Publish Date - May 13 , 2025 | 11:13 PM

రైతులు యూ రియా వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళావాల శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం గుండుమాల్‌ మం డల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

కోస్గిలో కరదీపికను విడుదల చేస్తున్న శాస్త్రవేత్తలు, అధికారులు

- వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల శాస్త్రవేత్తలు

కోస్గి రూరల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): రైతులు యూ రియా వినియోగాన్ని తగ్గించాలని వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళావాల శాస్త్రవేత్తలు సూచించారు. మంగళవారం గుండుమాల్‌ మం డల కేంద్రంలోని రైతు వేదికలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాలెం వ్యవసాయ పాలిటె క్నిక్‌ శాస్త్రవేత్తలు పరిమళ్‌ కుమార్‌, జేడీ సరిత మాట్లా డుతూ.. రైతులు పంట మార్పిడిని అవలంభించి పప్పు, తృణ ధాన్యాలను మార్చి వేసుకోవాలని సూచించారు. నేల సారాన్ని పెంచు కోవడం, భూ పరిరక్షణ, నీటి సంరక్షణ పద్ధతులను రైతులకు వివరించారు. యూరియాను తగ్గించి పచ్చిరొట్ట ఎరువులను వాడాలన్నారు. రసాయన మందులకు బదులుగా జీవన రసాయ నాలు, జీవ ఎరువులు వాడడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీఏవో జాన్‌ సుధాకర్‌, జిల్లా పశు వైద్యా ధికారి ఈశ్వర్‌రెడ్డి, జిల్లా హార్టికల్చర్‌ అధికారి హర్షవర్ధన్‌, ఏవోలు రేష్మారెడ్డి, రామకృష్ణ, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

పెద్దకొత్తపల్లి: పంట మార్పిడి చేపడితే అధిక దిగుబడులు పొందవ చ్చునని కృషి విజ్ఞాన కేంద్రం పాలెం శాస్త్రవేత్తల బృందం వెల్లడించిం ది. పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లి గ్రామంలో మంగళవా రం ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. శాస్త్రవేత్త డాక్టర్‌ కే.రామకృష్ణ మాట్లాడుతూ పంటల్లో ఎరువుల యాజమాన్యం పద్ధతుల గురించి వివరించారు.

Updated Date - May 13 , 2025 | 11:13 PM