రైతులు ఇబ్బంది పడొద్దు
ABN, Publish Date - May 07 , 2025 | 11:41 PM
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
చారకొండ, మే 7 (ఆంధ్రజ్యోతి): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ, జూపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో 83 మంది రైతుల నుంచి 285 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు భీమయ్యగౌడ్ తెలిపారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ అద్దంకి సునీత, ఆర్‌ఐ భరత్, సోసైటీ సిబ్బంది, రైతులు ఉన్నారు.
Updated Date - May 07 , 2025 | 11:41 PM