పాలిసెట్‌కు సర్వం సిద్ధం
ABN, Publish Date - May 12 , 2025 | 10:37 PM
పాలిసెట్‌కు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 32 కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, 12,104 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 32 కేంద్రాల ఏర్పాటు
పరీక్షకు హాజరుకానున్న 12,104 మంది విద్యార్థులు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం/నారాయణపేట/గద్వాల సర్కిల్/నాగర్‌కర్నూల్ టౌన్/వనపర్తి విద్యావిభాగం, మే 12 (ఆంధ్రజ్యోతి): పాలిసెట్‌కు ఉమ్మడి జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 32 కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా, 12,104 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లకు పరీక్ష నిర్వహణపై అవగాహన కల్పించారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని మహబూబ్‌నగర్ జిల్లా పాలిసెట్ పరీక్షల కన్వీనర్ మోహన్‌బాబు సూచించారు. సోమవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో పరీక్షల ఏర్పాట్లు ఆయన పరిశీలించారు.
Updated Date - May 12 , 2025 | 10:37 PM