ప్రతీ రైతుకు 11నెంబర్లతో విశిష్ట సంఖ్య
ABN, Publish Date - May 02 , 2025 | 11:30 PM
దేశంలోని ప్రతీ పౌరుడికి ఆధార్‌తో గుర్తింపు ఇచ్చిన విధం గా ప్రతి రైతుకు 11నెంబర్లతో విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు వివరిం చారు.
మండల వ్యవసాయ అధికారులతో జిల్లా అధికారుల వీడియో కాన్ఫరెన్స్
మల్దకల్, మే 2 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ప్రతీ పౌరుడికి ఆధార్‌తో గుర్తింపు ఇచ్చిన విధం గా ప్రతి రైతుకు 11నెంబర్లతో విశిష్ట సంఖ్యను కేటాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు వివరిం చారు. మల్దకల్‌లోని రైతువేదికలో శుక్రవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఫార్మర్ రిజిస్ర్టేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజి టలైజేషన్ చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్ర భుత్వం సహకారంతో ఈ ప్రాజెక్టును చేర్చింద న్నారు. భూమిఉన్న ప్రతీ రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారంతో ఫార్మన్ రిజిస్ర్టేషన్ చేస్తారన్నా రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమ లుకు ఫార్మర్ రిజిస్ర్టేషన్ అనుసంధానం చేస్తా రని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలైన రై తుభరోసా, రుణమాఫీ తదితర వాటికి ఫార్మర్ రిజిస్ర్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. రైతు విశిష్ట సంఖ్యను పొందేందకు మీ ఆధార్, భూ యాజమాన్య పాస్‌బుక్ ఆధార్‌కార్డుకు లింక్ చే యబడిన, మొబైల్ నెంబర్ తీసుకుని సమీపం లోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ వి స్తరణ అధికారిని సంప్రదించి రిజిస్ర్టేషన్ చేసు కోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ వ్య వసాయ సంచాలకులు సంగీతలక్ష్మి, డివిజన్ అధికారులు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 02 , 2025 | 11:30 PM